బయ్యారం, నవంబర్ 27: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ పెద్దచెరువులో శనివారం ఎన్డీఆర్ఎఫ్ బృందం మాక్‌డ్రిల్ నిర్వహించింది. వరదనీటిలో ముగినిపోయినప్పుడు తమను తాము రక్షించుకోవడంతోపాటు ఇతరులను కాపాడే సమయంలో అనుసరించాల్సిన పద్ధతులను బృందం సభ్యులు వివరించారు. అదనపు కలెక్టర్ కొమురయ్య మాట్లాడుతూ.. ఏటా బయ్యారం పెద్దచెరువులో ప్రమాదవశాత్తు మునిగి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని, అందువల్లే ఇక్కడ మాక్‌డ్రిల్ నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.