‘ఎలాంటి టెన్షన్స్ లేకుండా జీవితాన్ని సరదాగా గడుపుతుంటాడు సుందరం. ప్రేమ, పెళ్లి విషయంలో అతనికి ఎన్నో ఆశలుంటాయి. ఈ క్రమంలో సుందరం జీవితంలోకి ఓ ముద్దుగుమ్మ ప్రవేశిస్తుంది. ఈ జంట ప్రేమాయణం ఎలా సాగిందన్నదే మా చిత్ర ఇతివృత్తం’ అన్నారు వివేక్ ఆత్రేయ. ఆయన దర్శకత్వంలో నాని, నజ్రియా ఫహద్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అంటే సుందరానికీ’. నవీన్ యెర్నేని, రవిశంకర్. వై నిర్మాతలు. జూన్ 10న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సోమవారం కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. ఇందులో నాయకానాయికలు సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 20న విడుదల చేయబోతున్నారు. నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, సీఈఓ: చెర్రీ, రచన-దర్శకత్వం: వివేక్ ఆత్రేయ.