టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని తన కొత్త చిత్రం టక్ జగదీష్ ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్ ట్విటర్, ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్స్ ద్వారా ప్రమోషన్ షురూ చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ నెల తన అభిమానులకు ఖచ్చితంగా ఎక్జయిటింగ్ నెల కాబోతుందని నాని హామీనిచ్చాడు. నాని పోస్టుకు డైరెక్టర్ శివ నిర్వాణ స్పందిస్తూ..టక్ జగదీష్ లో నానిలోని యాక్టింగ్‌ను మరో స్థాయిలో చూస్తారని కామెంట్ పెట్టాడు.
ఈ సారి పండగ థియేటర్లోనే అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. టక్ జగదీష్ లో రీతూవర్మ, ఐశ్వర్యరాజేశ్ ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఐశ్వర్యరాజేశ్ ఈ చిత్రంలో నాని కజిన్‌గా కనిపించనున్నట్టు టాక్. నిన్నుకోరి, మజిలీ చిత్రాల తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్లో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Eesari pandaga Theatre lone🙌#TuckjagadishonApril23rd@NameisNani performance
— Shiva Nirvana (@ShivaNirvana) March 18, 2021
next level anthe🔥👌 https://t.co/kKZIudR8pC pic.twitter.com/4vzIOWHA4b
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.