ఎవరైనా పెద్దలు వస్తే చేతులు జోడించి నమస్కరించమని ఇంట్లోవాళ్లు చెబుతారు. నమస్కారం గౌరవ సూచకం. అయితే నమస్కరించేటప్పుడు రెండు చేతులనూ జోడిస్తాం. దీనివల్ల రెండు చేతుల్లోని శక్తి కేంద్రాలు కలవడంతోపాటు భావోద్వేగ స్థితిలో అధికంగా విడుదలైన శక్తి.. స్థిరీకరణ చెందుతుంది.
ఇద్దరి మధ్యా సకారాత్మక తరంగాలు ప్రసారం అవుతాయి. ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి ఉదయం సూర్య నమస్కారాల వల్ల శరీరానికి కావాల్సిన ‘డి’ విటమిన్ లభించడంతోపాటు వ్యాయామమూ జరుగుతుంది. అందుకే మన పెద్దలు నమస్కారం ఒక సంస్కార కృత్యంగా పేర్కొన్నారు.