Naga Chaitanya | సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య కొద్ది రోజులకి ఆమెకి విడాకులు ఇచ్చి తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్లని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న ఈ జంట ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా, తమ వైవాహిక బంధాన్ని బలంగా ఉంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటిస్తున్నామని పేర్కొన్నారు నాగ చైతన్య. ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన పర్సనల్ లైఫ్, వృత్తిపరమైన ఆసక్తుల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు నాగ చైతన్య.
వివాహం తర్వాత జీవితం ఎంతో ఆనందంగా సాగుతోంది. వృత్తిపరంగా మేమిద్దరం కూడా క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ, మా బంధాన్ని కాపాడుకోవడానికి కొన్ని నియమాలను పాటిస్తున్నాం అని చెప్పుకొచ్చారు చైతన్య. హైదరాబాదులో ఉన్నప్పుడు ఉదయం మరియు రాత్రి భోజనాన్ని కలిసి చేయాలని నిర్ణయించుకున్నామంటూ చైతన్య వివరించారు. అలా చేయడం వలన మేమిద్దరం కలిసి ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. వారాంతాలలో మాత్రం తనకు ఇష్టమైనట్లుగా సమయం గడపడం, ఇంట్లో మూవీ నైట్ ప్లాన్ చేయడం, బయట షికార్లకు వెళ్లడం, లేదా ఇష్టమైన వంటకాలు ఆర్డర్ చేయడం , కలసి వండడం వంటివి చేస్తానని చెప్పారు.
తనకు రేసింగ్ అంటే ఇష్టమని, శోభితకు పుస్తకాలు చదవడం ఇష్టమని తెలిపారు. ఇటీవల నేను శోభితను రేస్ట్రాక్పై డ్రైవింగ్ నేర్పించాను. ఆమె ఎంతో ఆనందించిందని చెప్పాడు. అంతేకాకుండా తన నిజ జీవిత హీరోల గురించి కూడా చైతన్య వెల్లడించారు. పారిశ్రామికవేత్త రతన్ టాటా తనకు ఎంతో స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తిగా, ఆయనను గౌరవిస్తాను అని తెలిపారు, ఎలాన్ మస్క్ జీవిత ప్రయాణం తనను ఆశ్చర్యపరిచేదని చెప్పారు. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ అంటే కూడా తనకు అభిమానం ఉంటుందని తెలియజేశాడు. అంతేకాకుండా తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడు రాజమౌళిని ఎంతో అభిమానిస్తానని స్పష్టం చేశాడు చైతూ.