సాహసయాత్రకు సిద్ధం
అగ్ర కథనాయకుడు అక్కినేని నాగచైతన్య హీరోగా రూపొందుతున్న మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’.
అగ్ర కథనాయకుడు అక్కినేని నాగచైతన్య హీరోగా రూపొందుతున్న మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. కార్తీక్ దండు దర్శకుడు. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్.బి నిర్మాతలు. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు ఓ గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు ఈ సినిమా సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా సినిమా ప్రచారాన్ని మేకర్స్ వేగవంతం చేశారు. ఈ సినిమా నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఫస్ట్ సింగిల్‌ని మేకర్స్ విడుదల చేశారు.
ఈ సినిమాలో నాగచైతన్య నటిస్తున్న ట్రెజర్ హంటర్ అర్జున్ పాత్రను ఈ పాట పరిచయం చేసింది. ైస్టెల్, ఆటిట్యూడ్, ఎనర్జీతో అసాధారణమైన సాహసయాత్రకు సిద్ధమవుతున్న ట్రెజర్ హంటర్‌గా ఈ పాటలో చైతూ కనిపించారు. కథానాయకుడి స్వాగ్నీ, ఆటిట్యూడ్‌ను ఆవిష్కరిస్తూ అభినవకవి రాసిన ఈ పాటను బి.అజనీష్ లోక్‌నాథ్ ట్రెండీ బీట్స్‌తో కంపోజ్ చేసి, స్వయంగా ఆలపించారు. నాగచైతన్య దృఢమైన శరీరం, కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా నటిస్తున్నారు. ఈచిత్రానికి కెమెరా: రఘుల్ డి.హెరియన్, సంగీతం: అజనీష్ బి.లోక్‌నాథ్, సమర్పణ: బాపినీడు, నిర్మాణం: శ్రీవెంకటేశ్వర సినీచిత్ర, సుకుమార్ రైటింగ్స్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

