Thaman Interesting comments on Radhe shaym | బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా రాధేశ్యామ్. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రేమకు, విధికి మధ్య జరిగే సంఘర్షణ ఈ సినిమా కథ. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకే రోజు ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో రాధేశ్యామ్ సినిమాపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రాధే శ్యామ్ సినిమాకు తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. ఈ క్రమంలో సినిమా గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు తమన్. నిజమైన ప్రేమకు నిదర్శనం రాధే శ్యామ్.. కచ్చితంగా ఈ సినిమా చాలా రోజుల పాటు ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుందని నమ్మకంగా చెప్పారు రాధే శ్యామ్. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించిన ఈ సినిమాకు తమన్ రీ రికార్డింగ్ చేశారు. రాధే శ్యామ్ సినిమా తాను డబ్బుల కోసం చేయలేదని.. యూవీ క్రియేషన్స్‌తో తనకు ఉన్న అనుబంధం కారణంగానే ఈ సినిమాకు పనిచేసినట్లు తమన్ తెలిపాడు. తన కెరీర్ డల్ పీరియడ్‌లో ఉన్నప్పుడు యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ తనకు మహానుభావుడు, భాగమతి లాంటి సినిమాలు ఇచ్చారని.. ఆ సమయంలో తనను నమ్మి అవకాశాలు ఇచ్చిన వాళ్ల కోసం ఇప్పుడు కృతజ్ఞత చూపించాను అంటున్నాడు తమన్. ఆ రెండు సినిమాల కారణంగానే తన కెరీర్ ఇంత అద్భుతంగా ఉందని.. అందుకే రాధే శ్యామ్ సినిమాకు నేపథ్య సంగీతం అందించినట్లు తెలిపాడు తమన్. ఈ లెక్కన సినిమాకు తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు ఈయన.
సినిమా చూస్తున్నప్పుడు తెలియని ట్రాన్స్ లోకి వెళ్లిపోయానని.. చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన ప్రేమ కథ చూసిన ఫీలింగ్ కలిగిందని అంటున్నాడు తమన్. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులకు కూడా ఇదే ఫీలింగ్ కలుగుతోందని.. నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ రాధే శ్యామ్ సినిమా కూడా ఉన్నట్లే అంటున్నాడు తమన్. అంత నిజాయితీ ఉన్న ప్రేమ కథ ఇది అని తెలిపారు ఈ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్. ప్రభాస్, పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని.. ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ వాళ్లిద్దరే అని తెలిపారు తమన్. గతంలో సాహో సినిమా ట్రైలర్ కు మాత్రమే ఆర్ఆర్ అందించే అవకాశం వచ్చిందని.. ఇప్పుడు సినిమా మొత్తానికి రీ-రికార్డింగ్ అందించడం ఆనందంగా ఉందని అంటున్నాడు తమన్. రాధే శ్యామ్ పై ఈయన చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా రాధే శ్యామ్ సినిమాను నిర్మించాయి.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
వామ్మో…రాధేశ్యామ్ చిత్రానికి అన్ని వేల థియేటర్లా..”
Radheshyam | రాధేశ్యామ్ గురించి ఒక్కొక్కటిగా బయటకొస్తున్న అప్డేట్స్.. లేటెస్ట్ ఏంటంటే?
Radhe shyam | భారీధర పలికిన రాధేశ్యామ్ డిజిటల్-శాటిలైట్ హక్కులు..
దటీజ్ రెబల్ స్టార్ !! హాలీవుడ్లో కూడా విడుదల కానున్న ప్రభాస్ సినిమా