Appala Raju | హంతకుడు అప్పలరాజుకు ఉరిశిక్ష విధించిన విశాఖ కోర్టు
Appala Raju | ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని నరికి చంపిన అప్పలరాజు అనే హంతకుడికి విశాఖ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 2021 ఏప్రిల్ 15న విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో ఇద్దరు పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని అప్పలరాజు హత్యచేశాడు
Appala Raju : ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని నరికి చంపిన అప్పలరాజు అనే హంతకుడికి విశాఖ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 2021 ఏప్రిల్ 15న విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో ఇద్దరు పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని అప్పలరాజు హత్యచేశాడు. జుత్తాడలోని బత్తిన, బొమ్మిడి కుటుంబాల మధ్య వివాదాలున్నాయి.
ఈ క్రమంలో బొమ్మిడి కుటుంబం ఇంట్లోకి చొరబడిన అప్పలరాజు ఆరుగురిపై కత్తితో దాడి చేశాడు. దొరికిన వారిని దొరికినట్టు నరికిచంపేశాడు. హంతకుడి దాడిలో బొమ్మిడి రమణ (63), ఉషారాణి (35), అల్లూరి రమాదేవి (53), నక్కెళ్ల అరుణ (37), బొమ్మిడి ఉదయ్ (2), ఉర్విష (6 నెలలు) ఘటనా స్థలిలోనే మృతి చెందారు.
ఘటన తర్వాత నిందితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పించడంతో నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

