మురళీకృష్ణంరాజు, శృతిశెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘స్కై’. పృథ్వీ పెరిచర్ల దర్శకుడు. వేలార్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ నెల 6న రిలీజ్ కానుంది. శనివారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంటెన్స్ ఎమోషన్స్‌తో సాగే ప్రేమకకథా చిత్రమిదని దర్శకుడు తెలిపారు.
ఈ ప్రేమకథలో హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయని నిర్మాతల్లో ఒకరైన నాగిరెడ్డి గుంటక తెలిపారు. ఆనంద్ భారతి, రాకేష్ మాస్టర్, ఎంఎస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రసూల్ ఎల్లోర్, సంగీతం: శివప్రసాద్, సంభాషణలు, కథ: పృథ్వీ పెరిచర్ల, మురళీ కృష్ణంరాజు, నిర్మాతలు: నాగిరెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, లక్ష్మీ గుంటక, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పృథ్వీ పెరిచర్ల.