Mrunal Takhur | సోషల్ మీడియాలో నిత్యం వేల కొలది వార్తలు హల్చల్ చేస్తుంటాయి. వాటిలో ఏది నిజం, ఏది అబద్ధమో చెప్పడం కష్టం. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అందాల హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్లో ఉన్నారంటూ గత కొన్ని నెలలుగా రూమర్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.. ఈ ఇద్దరూ మూవీ ఈవెంట్స్, ప్రైవేట్ పార్టీల్లో తరచూ కలిసి కనిపించడం, ఫోటోలు వైరల్ కావడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. మృణాల్ ఈ రూమర్స్‌ను పలుమార్లు ఖండించింది. అయిత రీసెంట్గా మృణాల్ ధనుష్‌తో కాకుండా క్రికెటర్‌తో డేటింగ్లో ఉందంటూ కొత్త ప్రచారం మొదలైంది. టీమ్ఇండియా వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, మృణాల్ ఠాకూర్ రహస్యంగా డేటింగ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం నడిచింది.
ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఇటీవలే చిగురించిందని కొన్ని జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే ఈ ప్రేమ వ్యవహారాన్న గోప్యంగా ఉంచుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ పుకార్ల నడుమ మృణాల్ స్పందించింది. ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో తనకు సంబంధం ఉందన్న వార్తలను నటి మృణాల్ ఠాకూర్ ఖండించారు. శ్రేయస్‌తో డేటింగ్లో ఉన్నారన్న రూమర్లు పూర్తిగా ఆధారంలేనివేనని స్పష్టం చేశారు. ఇటువంటి వార్తలు వింటుంటే నవ్వువస్తుందని, ఇవన్నీ “ఫ్రీ పీఆర్ స్టంట్స్” తప్ప మరేదీ కాదని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు.
ఈ వ్యాఖ్యలతో తనపై వస్తున్న గాసిప్స్‌కు మృణాల్ గట్టి బ్రేక్ వేసినట్లయ్యింది. ఇదే మొదటిసారి కాదు… ఆమెపై ఇంతకు ముందు కూడా వివిధ రకాల రూమర్స్ వచ్చాయి.ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడిన శ్రేయస్ అయ్యర్ రెస్ట్‌లో ఉన్నాడు. క్రమంగా కోలుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే సమయంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌తో శ్రేయస్ అయ్యర్ ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండడం విశేషం. మరోవైపు మృణాల్ రీసెంట్గా.. నా కెరీర్లో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. నేను నా పనిపై ఫోకస్ చేస్తున్నా. నా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు అని పేర్కొంది. కాని శ్రేయస్‌తో రూమర్స్ ఎక్కువ కావడంతో తప్పక స్పందించాల్సి వచ్చింది.