ఎంపీడీవో, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్

మహబూబ్‌నగర్/దేవరకద్ర : జిల్లాలోని దేవరకద్ర పశువుల సంతకు సంబంధించి నకిలీ రశీదు పుస్తకాలను ముద్రించి సంత ఆదాయాన్ని గండి కొట్టిన వ్యవహారంలో ఎంపీడీవో, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఒక ప్రకటనలో తెలిపారు.
దేవరకద్ర పశువుల సంతకు ప్రఖ్యాతిగాంచిందని.. జిల్లా నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పశువులను ఈ సంతకు తీసుకువస్తారని కలెక్టర్ తెలిపారు. అయితే పశువుల అమ్మకం, కొనుగోలు సందర్భంగా గ్రామ పంచాయతీ ద్వారా వసూలు చేసే ఫీజు విషయంలో గ్రామపంచాయతీకి సంబంధం లేని వ్యక్తులు.. ముఖ్యంగా సర్పంచ్ కుమారుడు నకిలీ రశీదు పుస్తకాలను తయారుచేసి ఫీజు వసూలు చేస్తుండగా అదనపు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేసి పట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు.
సర్పంచ్ కుమారుని వాహనంలో నకిలీ రశీదు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై గతంలోనే పోలీస్ కేసు కూడా నమోదైందని ఆయన వెల్లడించారు. ఇదే విషయంపై గ్రామపంచాయతీ సర్పంచ్ కొండా విజయమ్మ, పూర్వపు ఎంపీవో ప్రస్తుత ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి వనితలకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయగా… వారి నుంచి సరైన సమాధానం రానందున ముగ్గురినీ సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఈ విషయంపై తుది విచారణకు ఆదేశించామన్నారు. పోలీసుల తరఫున సైతం విచారణ కొనసాగుతోందన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన రాబడికి గండి కొట్టడమే కాకుండా.. గ్రామపంచాయతీ చట్టానికి వ్యతిరేకంగా పని చేయటం, అక్రమాలకు పాల్పడిన కారణంగా ముగ్గురిని సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

