Siraj | ఆ పేరు కారణంగానే సిరాజ్‌ను సెలెక్ట్ చేయలేదు..! దుమారం రేపుతున్న రాజకీయ విమర్శలు
న్యూజిలాండ్‌తో( Zealand) జరిగే టెస్ట్ తుది జట్టు నుండి స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను (Mohammed Siraj) తొలగించడంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్ : న్యూజిలాండ్‌తో( Zealand) జరిగే టెస్ట్ తుది జట్టు నుండి స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను (Mohammed Siraj) తొలగించడంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిరాజ్‌ను జట్టు నుండి తొలగించడం మత వివక్ష అని, కేవలం అతడి పేరు కారణంగానే పక్కనబెట్టారని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్( MP Imran Masood) తీవ్ర ఆరోపణలు చేశారు.
అతను గత పర్యటనల్లో బాగా రాణించినప్పటికీ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపో యాడని, దీనికి ప్రధాన కారణం అతడి పేరు ‘సిరాజ్’ కావడమే. కేవలం పేరు కారణంగానే అతడికి తుది జట్టులో అవకాశమివ్వడం లేదని విమర్శించారు. బాగా ఆడుతున్నప్పటికీ అతడిని ఎంపిక చేయకపోతే అది వివక్షే అవుతుందని ఎంపీ మసూద్ మండిపడ్డారు.
మసూద్ ఆరోపణలను బీజేపీ ‘అసంబద్ధమైనవి’గా కొట్టిపారేసింది, మరియు అన్ని నిర్ణయాలు ఆట పరిస్థితుల ఆధారంగానే తీసుకున్నామని భారత జట్టు యాజమాన్యం పేర్కొంది. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ తిప్పికొట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ ఈ డ్రామా ఆడుతుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఇది సిగ్గుచేటన్నారు. ఇన్నాళ్లు ఎన్నికల్లో ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు క్రికెట్ జట్టు ఎంపికలోనూ రాజకీయాలు మొదలుపెట్టిందని విమర్శించారు.
తప్పు పట్టిన క్రికెట్ దిగ్గజాలు..
మరో వైపు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి వంటి భారత క్రికెట్ దిగ్గజాలు కూడా సిరాజ్‌ను జట్టు నుండి తొలగించడాన్ని ప్రశ్నించారు. ఆట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జట్టు ప్రాధాన్యతల ప్రకారమే తీసుకున్నామని భారత జట్టు యాజమాన్యం పేర్కొంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siraj | ఆ పేరు కారణంగానే సిరాజ్‌ను సెలెక్ట్ చేయలేదు..! దుమారం రేపుతున్న రాజకీయ విమర్శలు
DK Shivakumar | మాకే తాగడానికి నీళ్లు లేవు, మికేలా ఇస్తాం.. సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
Avinash Reddy Arrest | కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్..విడుదల
January 12 Vidudala | ‘జనవరి 12 విడుదల’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్.. ‘దివికి దివికి’ ప్రోమో విడుదల!
VishwakSen | సంస్కారం వయసుతో పాటు పెరగాలి.. సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

