OTT | సినీ ప్రేక్షకులకు ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందనుంది. థియేటర్లలో లవ్, హారర్, కామెడీ, థ్రిల్లర్ జానర్స్‌లో పలు ఆసక్తికరమైన సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా, ఓటీటీల్లో కూడా బ్లాక్‌బస్టర్ మూవీస్, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించనున్నాయి. నవంబర్ 7న రష్మిక మందన్నా నుంచి విష్ణు విశాల్ వరకూ స్టార్లు తెరపై సందడి చేయబోతున్నారు.
రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్లో అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ నవంబర్ 7న విడుదల కానుంది.
‘జటాధర’
సుధీర్ బాబు, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా జంటగా నటించిన ‘జటాధర’ ఈ వారం ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధంగా ఉంది. గుప్తనిధులు, పిశాచ బంధనాలు, డ్రీమ్స్ వెనుక సైన్స్ అండ్ సస్పెన్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు వెంకట కల్యాణ్ దర్శకత్వం వహించారు. సోనాక్షికి ఇది తొలి తెలుగు చిత్రం. తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న విడుదల కానుంది.
‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’
‘మసూద’ ఫేం తిరువీర్, ‘కమిటీ కుర్రాళ్లు’ ఫేం టీనా శ్రావ్య హీరోహీరోయిన్లుగా నటించిన లవ్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ నవంబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది.
తమిళ డబ్బింగ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’
కోలీవుడ్ స్టార్ విష్ణు విశాల్ నటించిన తాజా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘ఆర్యన్’ గత వారం తమిళంలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ నవంబర్ 7న విడుదల కానుంది. ప్రవీణ్ కె దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ సుధాకర్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
మలయాళ హిట్ ‘డీయస్ ఈరే’
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ హీరోగా నటించిన మిస్టరీ హారర్ థ్రిల్లర్ ‘డీయస్ ఈరే’ ఇప్పటికే మలయాళంలో హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఇది తెలుగులో నవంబర్ 7న విడుదల కానుంది.
లవ్ ఎంటర్టైనర్ ‘ప్రేమిస్తున్నా’
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్లో మెప్పించిన సాత్విక్ వర్మ హీరోగా, ప్రీతి నేహ హీరోయిన్గా నటించిన లవ్ ఎంటర్టైనర్ ‘ప్రేమిస్తున్నా’ కూడా ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహించారు.
ఈ వారం ఓటీటీల్లో వచ్చే సినిమాలు & సిరీస్‌లు
అమెజాన్ ప్రైమ్ వీడియో
రాబిన్ హుడ్ (వెబ్ సిరీస్) – నవంబర్ 2
నైన్ టూ నాట్ మీట్ యూ (వెబ్ సిరీస్) – నవంబర్ 3
జియో హాట్ స్టార్
బ్యాడ్ గర్ల్ – నవంబర్ 4
ది ఫాంటాస్టిక్ 4 (ఇంగ్లీష్) – నవంబర్ 5
సోనీలివ్
మహారాణి (వెబ్ సిరీస్) – నవంబర్ 7
నెట్‌ఫ్లిక్స్
ఇన్ వేవ్స్ అండ్ వార్ (హాలీవుడ్ సినిమా)
నవంబర్ 3 బారాముల్లా (హిందీ చిత్రం) – నవంబర్ 7