హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి) మధ్య పరస్పర సహకారం, నాయకత్వ వికాసం, సామర్థ్య నిర్మాణం, మెరుగైన శిక్షణ కోసం మంగళవారం అవగాహన ఒప్పందం కుదిరింది.
తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్, ఆస్కి రిజిస్ట్రార్ అండ్ సెక్రటరీ ఓపీ సింగ్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో ఆధునిక పరిపాలనా విధానాలపై అవగాహన, పరస్పర ప్రయోజనకర కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుంటుందని డీజీ అభిలాష బిస్త్ తెలిపారు.