Mookuthi Amman 2 | రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహాశక్తి’.. తొలి రోజే షాకింగ్ కలెక్షన్లు,నయనతారకు నిరాశేనా?
Mookuthi Amman 2 | లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆరంభం అందుకోలేకపోయింది. తెలుగులో ‘మహాశక్తి’ పేరుతో విడుదలైన ఈ భక్తిరస ఫాంటసీ చిత్రం నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి భాగం మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో రెండో భాగంపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే విడుదలైన తొలి రోజే ఈ సినిమా వసూళ్లు నిరాశపరిచినట్లు ట్రేడ్ వర్గాల అంచనాలు వెల్లడిస్తున్నాయి.
Mookuthi Amman 2 | లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆరంభం అందుకోలేకపోయింది. తెలుగులో ‘మహాశక్తి’ పేరుతో విడుదలైన ఈ భక్తిరస ఫాంటసీ చిత్రం నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి భాగం మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో రెండో భాగంపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే విడుదలైన తొలి రోజే ఈ సినిమా వసూళ్లు నిరాశపరిచినట్లు ట్రేడ్ వర్గాల అంచనాలు వెల్లడిస్తున్నాయి. ‘మూకుత్తి అమ్మన్ 2’ చిత్రాన్ని మొదటి భాగంతో పోలిస్తే భారీ స్థాయిలో తెరకెక్కించారు. కథ, విజువల్స్, నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ కేటాయించారు. ఈ సినిమా నిర్మాణానికి రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇంత భారీ వ్యయంతో రూపొందిన సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు కేవలం రూ.3 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ నివేదికలు చెబుతున్నాయి.
భారీ బడ్జెట్ సినిమాకు ఈ స్థాయి ఓపెనింగ్ ఆశించిన ఫలితం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నయనతారకు ఉన్న క్రేజ్, సినిమా ప్రచారం, మొదటి భాగానికి ఉన్న గుర్తింపు దృష్ట్యా మంచి వసూళ్లు వస్తాయని భావించారు. కానీ తొలి రోజు వసూళ్లు మాత్రం అంచనాలను అందుకోలేకపోయాయి. ‘మూకుత్తి అమ్మన్’ మొదటి భాగానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఆధ్యాత్మిక అంశాలను వినోదంతో కలిపి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. అయితే రెండో భాగం బాధ్యతలను ప్రముఖ దర్శకుడు సుందర్ సి చేపట్టారు. ఆయన దర్శకత్వంలో భారీ స్థాయిలో ఈ సీక్వెల్‌ను రూపొందించారు.
నయనతార మరోసారి అమ్మవారి పాత్రలో కనిపించగా, ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, దునియా విజయ్, ఊర్వశి, అభినయ, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, రౌడీ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ప్రస్తుతం ‘మహాశక్తి’ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించడం కీలకంగా మారింది. తొలి రోజు వచ్చిన వసూళ్లతో పోలిస్తే శని, ఆదివారాల్లో కలెక్షన్లు గణనీయంగా పెరగాల్సి ఉంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తేనే సినిమా వసూళ్లలో పుంజుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, భక్తి చిత్రాలను ఇష్టపడే వారి ఆదరణ ఈ సినిమాకు ఎంతవరకు లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mookuthi Amman 2 | రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహాశక్తి’.. తొలి రోజే షాకింగ్ కలెక్షన్లు,నయనతారకు నిరాశేనా?
అవుసులపల్లిలో పోలీసుల విస్తృత తనిఖీలు.. 75 వాహనాలు స్వాధీనం
Ramayana | ‘రామాయణ’ సునామీ.. రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు!
King | తెలుగులోనూ షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. థియేటర్లలో ప్రత్యక్షమైన తెలుగు స్టాండీలు,ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
Kaala Bhairava | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

