హైదరాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 194 ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిషరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ సమితి హెచ్చరించింది.
ఈ మేరకు ప్రభుత్వానికి కమిటీ సభ్యుల బృందం గురువారం వినతిపత్రంతో కూడిన ముందస్తు హెచ్చరికను అందజేస్తూ, సమస్యల పరిష్కారానికి 15రోజుల గడువు ఇచ్చింది. ఈ సందర్భంగా సమితి నేతలు మా ట్లాడారు. కార్యక్రమంలో నేతలు భూ తం యాకమల్లు, జగదీశ్, కొండయ్య, అరవింద్ఘోష్, సత్యనారాయణ, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.