హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): మనవాళ్లు విదేశాల్లో స్థిరపడినా మాతృభాషను, తెలంగాణ సంసృతిని కొనసాగిస్తుండటం హర్షించదగ్గ విషయమని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. స్విట్జర్లాండ్‌లో పర్యటిస్తున్న స్పీకర్ బృందం గురువారం ప్రవాస భారతీయులతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ అధికారిక వెబ్ సైట్, బతుకమ్మ ఉత్సవాల పోస్టర్‌ను స్పీకర్ ఆవిషరించారు. స్పీకర్ మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రకృతితో ముడిపడిన జీవనానికి ప్రతీక అని కొనియాడారు. స్విట్జర్లాండ్‌లో నిర్మించతలపెట్టిన వేంకటేశ్వర స్వామి దేవాలయానికి టీటీడీ ద్వారా సహాయ సహకారాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. బృందం లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, శా సనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి, శాసనమండలి కార్యదర్శి నరసింహాచార్యు లు, స్పీకర్ ఓఎస్డీ వెంకటేశం ఉన్నా రు.