మత్స్యకారులను బలోపేతం చేస్తున్నాం : మంత్రి తలసాని
మత్స్యకారులు | ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మత్స్యకారులను బలోపేతం చేస్తున్నామని రాష్ర్ట పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మత్స్యకారులను బలోపేతం చేస్తున్నామని రాష్ర్ట పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. మత్స్యకారులు ఖాళీగా ఉండకుండా పని కల్పించాలనే ఉద్దేశంతో సంచార చేపల విక్రయ వాహనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. నగరంలోని హెచ్ఎండీఏ గ్రౌండ్లో జీహెచ్ఎంసీ, 29 జిల్లాలకు కలిపి 117 సంచార చేపల విక్రయ వాహనాలను మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ర్టంలో మత్స్యకారుల గురించి ఎవరూ ఆలోచించలేదు. వారికి బడ్జెట్లో కనీసం నిధులు కేటాయించలేదు. కానీ సీఎం కేసీఆర్ గొప్ప మనసుతో బడ్జెట్లో వారి కోసం రూ. 100 కోట్లు కేటాయించారు. రాష్ర్టంలో మత్స్యకారుల సంపదను పెంచుతున్నామని తెలిపారు. మహిళ మత్స్యకారులకు ప్రోత్సాహంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. ఇవాళ పంపిణీ చేసిన వాహనాలను మహిళల పేరుమీదనే ఇస్తున్నామని మంత్రి తలసాని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, అరికెపుడి గాంధీ, భేతి సుభాష్ రెడ్డి, ఎంపీలు బండ ప్రకాష్, కొత్త ప్రభాకర్ రెడ్డి, బిబి పాటిల్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ శ్రీలత, స్థానిక కార్పొరేటర్ విజయా రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్త ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రుచిగా తెలంగాణ చేపలు : మంత్రి హరీష్ రావు
కరోనా ఎఫెక్ట్.. హోలీ వేడుకలపై ఆంక్షలు
రాష్ట్రంలో భారీగా అదనపు కలెక్టర్ల బదిలీ..
రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

