రుచిగా తెలంగాణ చేపలు : మంత్రి హరీష్ రావు
తెలంగాణ చేపలు | తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత మంచివారో అంతే రుచిగా తెలంగాణ చేపలు ఉంటాయని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. సంచార చేపల విక్రయ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత మంచివారో అంతే రుచిగా తెలంగాణ చేపలు ఉంటాయని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. సంచార చేపల విక్రయ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంచి ఆలోచన చేశారు. ఈ వాహనాలను అందుబాటులోకి రావడం వల్ల మత్స్యకారులకు ఉపాధి విరివిగా పెరుగుతుందన్నారు.
నగరంలోని హెచ్ఎండీఏ గ్రౌండ్లో జీహెచ్ఎంసీ, 29 జిల్లాలకు కలిపి 117 సంచార చేపల విక్రయ వాహనాలను మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో చేపలు ఒకట్రెండు చోట్ల మాత్రమే లభిస్తాయి. దీంతో నగర ప్రజలందరూ చేపలు తినే అవకాశం లేకుండా పోయింది. ఈ క్రమంలో మంత్రి తలసాని మంచి ఆలోచన చేసి.. సంచార చేపల విక్రయ వాహనాలను అందుబాటులోకి తెచ్చారన్నారు. ప్రస్తుతం 117 వాహనాలను ప్రారంభించుకున్నామని చెప్పారు.
మత్స్యకారులకు మంచి రోజులు
మత్స్య పరిశ్రమ అంటే కోస్తా మాత్రమే గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి నీళ్లలో చేపల ఉత్పత్తి చేస్తోంది. మత్స్యకారులకు మంచి రోజులు వచ్చాయని రాష్ర్టంలో నీలి విప్లవం అద్భుతంగా కొనసాగుతుందన్నారు. ఒకప్పుడు చేపలను దిగుమతి చేసుకునే వాళ్లం.. ఇప్పుడు చేపలను ఎగుమతి చేసే స్థానానికి ఎదిగామన్నారు. రానున్న రోజుల్లో చేపల పరిశ్రమకు సంబంధించిన అనేక పరిశ్రమలను తెలంగాణలో నెలకొల్పే అవకాశం ఉందన్నారు.
రూ. 500 కోట్లతో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం చేపట్టాలని భావించిన సీఎం కేసీఆర్.. వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల ఏర్పాటుకు ఈ బడ్జెట్లో రూ. 500 కోట్లు కేటాయించారని తెలిపారు. మత్స్యకారులు దురదృష్టవశాత్తు చనిపోతే రూ. 6 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, అరికెపుడి గాంధీ, భేతి సుభాష్ రెడ్డి, ఎంపీలు బండ ప్రకాష్, కొత్త ప్రభాకర్ రెడ్డి, బిబి పాటిల్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ శ్రీలత, స్థానిక కార్పొరేటర్ విజయా రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్త ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
కరోనా ఎఫెక్ట్.. హోలీ వేడుకలపై ఆంక్షలు
రాష్ట్రంలో భారీగా అదనపు కలెక్టర్ల బదిలీ..
రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

