హైదరాబాద్, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ) : చేనేత పెన్షన్‌లో పారదర్శక పాటించాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం సీఎం రేవంత్‌కు వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే ఆసరా పెన్షన్ పొందుతున్న చేనేత కార్మికుల పెన్షన్లను యథావిధిగా కొనసాగించాలని, కొత్తగా చేయూత పథకం అమలుతో లబ్ధిదారులకు నష్టం జరుగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
చేనేత సహకార సంఘాల్లో సభ్యత్వం ఉండి 50 ఏండ్లు నిండినవారికి ఈ పథకం వర్తింపజేయాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ధనసరి సీతక్కను కోరారు.