Kalvakuntla Sanjay | మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టడంపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు. మార్క్ఫెడ్ అధికారులకు ఫోన్ చేసి, కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు తెరుస్తారని నిలదీశారు. నెల రోజులుగా మక్కలు ఎప్పుడు కొంటారని రైతులు రోడ్ల మీద ఎదురు చూస్తుంటే మజాక్ గా ఉందా అని మండిపడ్డారు.
రైతులు నెల రోజుల నుంచి ఇబ్బందులు పడుతుంటే మీకు కామెడీగా ఉందా అని మార్క్ఫెడ్ అధికారులపై కల్వకుంట్ల సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించమని అడిగితే నాలుగు రోజుల తర్వాత తెరుస్తామని అంటారా అని మండిపడ్డారు. ఇదేనా మీ బాధ్యత అని నిలదీశారు. మీకు ఎందుకింత అహంకారమని ప్రశ్నించారు. ఈ రోజు వెంటనే మొక్కజొన్న కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించారు. లేదంటే నేనే వెళ్లి మొక్కజొన్న కేంద్రాలను ప్రారంభిస్తానని.. మీరు వస్తారో.. రారో.. మీ ఇష్టమంటూ మండిపడ్డారు.
నెల రోజులుగా మక్కలు ఎప్పుడు కొంటారని రైతులు రోడ్ల మీద ఎదురు చూస్తుంటే మజాక్ గా ఉందా?
ఎందుకింత అహంకారం మీకు!
ఈరోజు వెంటనే మొక్కజొన్న కేంద్రాలను అధికారులు తెరవకుంటే, నేను వెళ్ళి తెరుస్తా
కోరుట్ల నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో జాప్యంపై మార్క్ ఫెడ్… pic.twitter.com/a0c8GQQrok
— Telugu Scribe (@TeluguScribe) April 9, 2026