గ్రాడ్యుయేట్లు ఓటు నమోదు చేసుకోవాలి
అర్హులైన గ్రాడ్యుయేట్లు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు జాబితాలో పేర్ల నమోదు కోసం మల్లాపూర్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎండీ ఉస్మాన్ - టీమ్ బీఎల్ఆర్ ఆధ్వర్యంలో ఫారం-18 ఓటరు నమోదు సహాయ శిబిరాన్ని నిర్వహించారు.
- ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి
ఉప్పల్, అక్టోబర్ 17: అర్హులైన గ్రాడ్యుయేట్లు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు జాబితాలో పేర్ల నమోదు కోసం మల్లాపూర్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎండీ ఉస్మాన్ – టీమ్ బీఎల్ఆర్ ఆధ్వర్యంలో ఫారం-18 ఓటరు నమోదు సహాయ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరం ద్వారా 70 మందికి పైగా పట్టభద్రులు తమ పేర్లను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో నమోదు చేసుకున్నారు. ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి హాజరై పట్టభద్రుల నమోదు కార్యక్రమానికి తమ మద్దతు, ప్రోత్సాహాన్ని అందించారు. ఎండీ ఉస్మాన్ మాట్లాడుతూ.. శిబిరానికి విచ్చేసి కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి, మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అర్హులైన పట్టభద్రులందరూ ఫారం-18 ద్వారా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

