22ఏ చిక్కుముడి వీడేనా?
దశాబ్దాల భూ యజమానులకు ఉన్న హక్కులను 22ఏ పేరిట కాలరాసిన కాంగ్రెస్ ప్రభుత్వం... వాటిని పరిష్కరిస్తామని చెప్పి చేతులు దులుపుకొన్నది. 22ఏ నుంచి అందరికీ ఉపశమనం కలిగిస్తామని చెప్పి మార్గదర్శకాలు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తోంది. కేవలం మెమోలకే పరిమితం చేసిన ప్రభుత్వం... యూఎల్సీ, జీవో నం. 118, జీవో నం. 59లోని పాత దరఖాస్తులను మాత్రమే పరిశీలిస్తామని చెబుతున్నారు. కానీ కొత్త దరఖాస్తుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే చోద్యం చూస్తున్నది.
- యూఎల్సీ, జీవో నం. 118, 59 అర్జీలపై మార్గదర్శకాలు కరువు
- పాత దరఖాస్తులనే పరిశీలిస్తామన్న జిల్లాల యంత్రాంగం
దశాబ్దాల భూ యజమానులకు ఉన్న హక్కులను 22ఏ పేరిట కాలరాసిన కాంగ్రెస్ ప్రభుత్వం… వాటిని పరిష్కరిస్తామని చెప్పి చేతులు దులుపుకొన్నది. 22ఏ నుంచి అందరికీ ఉపశమనం కలిగిస్తామని చెప్పి మార్గదర్శకాలు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తోంది. కేవలం మెమోలకే పరిమితం చేసిన ప్రభుత్వం… యూఎల్సీ, జీవో నం. 118, జీవో నం. 59లోని పాత దరఖాస్తులను మాత్రమే పరిశీలిస్తామని చెబుతున్నారు. కానీ కొత్త దరఖాస్తుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే చోద్యం చూస్తున్నది. ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రులు ఇద్దరూ ఈ అంశంపై చేసిన ప్రకటనలు నీటి మీద రాతలు మారిపోయాయని, రిజిస్ట్రేషన్లకు తావులేకుండా చేసిన సర్కారు వేధింపుల నుంచి ఎప్పుడు మోక్షం కలుగుతుందని వేలాది మంది బాధితులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ అంశంలో రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన భూ యజమానుల ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయి.
సిటీబ్యూరో, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఏకంగా 10 కీలక అంశాలను గుర్తించామని, 22ఏ సమస్యల పరిషారానికి హామీ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. సరారు మార్గదర్శకాలను (గైడ్ లైన్స్) మరిచిపోవడంతో సామాన్య ప్రజలు, బాధితులు అధికారుల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి నిషేధిత భూముల సమస్యల నుంచి బాధితులకు ఉపశమనం కలిగిస్తామన్నారు.
లేఅవుట్ అనుమతులు, అర్బన్ ల్యాండ్ సీలింగ్, అసైన్డ్ భూములు, జీవో 59, జీవో 118 కింద ఉన్న భూములు, సింగరేణి స్థలాలు, ప్రైవేటు పట్టా భూములు పొరపాటున 22ఏలో చేరడం వంటి పలు అంశాలు ఉన్నాయి. వీటిలో కీలక అంశాలకు సంబంధించిన విధివిధానాలను జారీ చేయకుండానే , మెమోలతో ప్రభుత్వం తొక్కి పెడుతోంది. ఇప్పటివరకు రెవెన్యూ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలు అన్నీ కూడా గతంలో పలు దశల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తాయి.
కొత్తగా 22ఏ జాబితాలో చేర్చిన అంశాలకు మాత్రమే తాజా మెమోలు, మంత్రులు ఆదేశాలు, ముఖ్యమంత్రి ప్రకటనలు వర్తిస్తాయి. కానీ ఇందులో ఆయా జాబితాల్లో ఇటీవల కొత్తగా చేర్చిన ఆస్తులను పరిష్కరించడానికి ఇప్పటివరకు సర్కారు ఎలాంటి మార్గదర్శకాలు, ఆదేశాలను జారీ చేయలేదు. గతంలో ఫీజులు చెల్లించి, రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఫైళ్లను మాత్రమే పరిశీలించాలని ప్రభుత్వం చెప్పినట్లుగా అధికారులు పేర్కొన్నారు. మరీ కొత్తగా 22ఏలో చేర్చిన అంశాలకు ఎప్పుడు పరిష్కరిస్తామనే విషయంలో సర్కారు స్పష్టమైన ఆదేశాలు ఇస్తే గానీ సాధ్యం కాదనీ అధికారులు తేల్చి చెబుతున్నారు.
నిలిచిన క్రయవిక్రయాలు…
దశాబ్దాల కిందట కొనుగోలు చేసిన భూములు, లేఅవుట్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెళ్తే 22ఏ పేరిట అధికారులు తిరసరిస్తున్నారు. తమ సొంత ఆస్తులను అత్యవసరాలకు అమ్ముకోలేకపోతున్నామని జనాలు ఆవేదన చెందుతున్నారు. 22ఏ నిబంధనల వల్ల లావాదేవీలు నిలిచిపోయి వేలాది కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన 10 అంశాలపై తక్షణమే సమగ్ర విధివిధానాలను రూపొందించి, జీవోలను విడుదల చేయాలని బాధిత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఫైలు సీసీఎల్ఏ, కలెక్టర్ స్థాయికి రాకుండా, నిబంధనలను పారదర్శకంగా కింది స్థాయి అధికారులకే అప్పగిస్తే తప్ప 22ఏ బాధితులకు విముక్తి లభించదనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మిగిలిన అంశాలపై మార్గదర్శకాలను విడుదల చేయాల్సిన అవసరం ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

