ఆర్టీసీ స్పెషల్ దోపిడీ
బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా నగరవాసులు ఊరుబాట పట్టారు. తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా జరుపుకోవడానికి కుటుంబాలతో సహా నగరవాసులు పెద్ద సంఖ్యలో సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో ఎప్పుడూ రద్దీని తలపించే భాగ్యనగరం శనివారం బోసిపోయినట్టుగా దర్శనమిచ్చింది.
- 50 శాతం అదనపు చార్జీలు
- బతుకమ్మ, దసరాకు సొంతూర్లకు నగరవాసులు
- బస్సుల సంఖ్య సరిపోక ప్రయాణికుల పాట్లు
- హైదరాబాద్ హైవేలపై వాహనాల రద్దీ
- కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్
- ప్రైవేటు వాహనాల్లో ఇష్టారాజ్యం
సిటీబ్యూరో, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా నగరవాసులు ఊరుబాట పట్టారు. తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా జరుపుకోవడానికి కుటుంబాలతో సహా నగరవాసులు పెద్ద సంఖ్యలో సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో ఎప్పుడూ రద్దీని తలపించే భాగ్యనగరం శనివారం బోసిపోయినట్టుగా దర్శనమిచ్చింది. ఒకేసారి లక్షలాది మంది బయలుదేరడంతో ప్రధాన జంక్షన్ల వద్ద గంటల తరబడి ట్రాఫిక్ సమస్య ఎదురైందని చెబుతున్నారు. జేబీఎస్, ఎంజీబీఎస్, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను సమకూరుస్తున్నామని చెప్పినప్పటికీ బస్సులు సమయానికి రాక గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ముఖ్యంగా కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు వెల్లే బస్సులన్నీ రద్దీని తలపిస్తున్నాయి. కాగా, ప్రత్యేక బస్సులో 50శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తుండటంతో ప్రయాణికులకు భారంగా మారింది. సొంతూళ్లకు వెళ్లాలంటే ప్రయాణ ఖర్చులు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బస్సుల్లో నిల్చొని ప్రయాణం చేయాల్సి ఉంటుండటంతో చాలా మంది ప్రయివేట్ ట్రావెల్స్ను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. ఉప్పల్ నుంచి హన్మకొండకు వెళ్లాలంటే ఒక్కరికి రూ.800-12 వందల వరకు క్యాబ్ ధరలు ఉన్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.
చాలా వరకు ఆన్లైన్లో బస్సుల సీట్లు బుక్ చేసుకోవడం కూడా సామాన్య జనాలకు ఇబ్బందిగా మారింది. సీట్లు లేకపోవడంతో మూడు నుంచి నాలుగు గంటల ప్రయాణానికి సైతం నిల్చొనే ప్రయాణం చేస్తున్నారు. నగరంలో 2900 బస్సులుంటే అందులో కేవలం 200 బస్సులు మాత్రమే నగరంలో రాకపోకలు సాగిస్తున్నాయి. మిగిలిన బస్సులన్నీ జిల్లాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. పలు జిల్లాల్లో ప్రయివేట్ డ్రైవర్లతో బస్సులు నడిపిస్తున్నారు.
గంటల తరబడి..
వాహనాలన్నీ హైవేలు ఎక్కుతుండటంతో శనివారం టోల్గేట్లు అన్నీ కిటకిటలాడాయి. ప్రభుత్వ, ప్రయివేట్ బస్సులు, కార్లు, బైక్లతో జాతీయ రహదారులు పోటెత్తాయి. టోల్ గేట్ల వద్ద వాహనాలు కిలో మీటర్ల మేర నిలిచిపోయాయి. పలు టోల్ ప్లాజాల వద్ద అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసినా వాహనాల రద్దీ మాత్రం తగ్గలేదు. ఫలితంగా గంటల తరబడి నెమ్మదిగా సాగుతున్న ప్రయాణంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ జాతీయరహదారి 65పై టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫాస్టాగ్ బ్యాలెన్స్ లేకపోవడం, సాంకేతిక సమస్యలు కూడా టోల్ ప్లాజా వద్ద రద్దీకి కారణమయ్యాయని సిబ్బంది తెలిపారు. కాగా, ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని చౌటుప్పల్ పరిధిలోని లక్కారం నుంచి వలిగొండ మార్గం మీదుగా చిట్యాలకు చేరుకునేలా వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లించారు. విజయవాడ వైపు వెళ్లే వాహనాలు సైతం కిలో మీటర్ల మేర నిలిచిపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. సాధారణంగా కీసర, చిల్లకల్లు, కొర్లపహాడ్, పంతంగి టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ సమస్య అంతరాయం కలిగించింది. శనివారం సాయంత్రానికే 60 వేలకు పైగా వాహనాలు వచ్చాయని టోల్గేట్ నిర్వాహకులు పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

