హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్టు కన్వీనర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఆన్లైన్, ప్రత్యక్ష సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును ఈ నెల 12 వరకు పొడిగించామని, ప్రైవేట్ కాలేజీల్లోని అన్ని సీట్లకు ఎయిడెడ్ కాలేజీల్లోని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల సీట్లకు స్పాట్ అడ్మిషన్ల తేదీని 13కు బదులు 14న నిర్వహించనున్నట్టు స్పష్టంచేశారు.
ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించండి: టీఆర్టీఎఫ్
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): బీఎడ్ అర్హత గల సెకండరీ గ్రేడ్ టీచర్లకు ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించాలని టీఆర్టీఎఫ్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేశ్, మారెడ్డి అంజిరెడ్డి శుక్రవారం సీఎం కార్యదర్శి అజిత్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.