రవీంద్రభారతి : వి3 న్యూస్ ఛానల్ డైరీని మంగళవారం రవీంద్రభారతిలో అంబ్కారీ శాఖ మంత్రి వి. శ్రీనివాస గౌడ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కృషిచేస్తున్నారని తెలిపారు.
మీడియా ఛానల్స్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు తోడ్పాటునందించాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వి3 న్యూస్ ఛానల్ చైర్మన్,టిఆర్ఎస్ నాయకులు కాచం సత్యనారాయణగుప్తా తదితరులు పాల్గొన్నారు.