Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
Palamuru Lift Inauguration | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని స్టేజ్ -1 లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, తూడి మేఘారెడ్డి మొదటి, రెండవ పంపులను బుధవారం ఆన్ చేశారు.
కొల్లాపూర్ : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ( Palamuru-Rangareddy Lift Irrigation) పథకంలోని స్టేజ్ -1 లో మొదటి, రెండవ పంపులను మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupally Krishna Rao ) ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, తూడి మేఘారెడ్డి బుధవారం ఆన్ చేశారు. దీంతో 145 మెగావాట్స్ సామర్థ్యం కలిగిన భారీ బహుబలి మోటర్లు నార్లాపూర్ రిజర్వాయర్లోకి కృష్ణానది నుండి డెలివరీ సిస్టర్న్ వద్ద ఎత్తిపోస్తున్నాయి.
రిజర్వాయర్ సామర్ధ్యం 6 టీఎంసీలు చేరుకునేంతవరకు ఐదు రోజులపాటు మోటార్లను రన్ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల బీఆర్ఎస్ నాయకులు నార్లాపూర్ పంపులను ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఈనెల 12న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిలు నార్లాపూర్ రిజర్వాయర్ ను సందర్శించారు.

కృష్ణా నదిలో నీళ్లు ఉన్నాయని వెంటనే పంపులను ఆన్ చేయకుంటే ఒకటి రెండు రోజులలో ప్రాజెక్టును ముట్టడించి తమే పంపులను ఆన్ చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హుటాహుటినా మోటర్లను ఆన్ చేయడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2023 సెప్టెంబర్ 16న కేసీఆర్ పాలమూరు,రంగారెడ్డి లిఫ్ట్ మొదటి పంపును ప్రారంభించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

