వాషింగ్టన్, జూన్ 1: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇంట విషాదం నెలకొన్నది. మాజీ ప్రథమ మహిళ, ఒబామా భార్య మిషెల్ తల్లి మరియన్ రాబిన్సన్ (86) శుక్రవారం కన్నుమూశారు. ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో (2009-17) మరియన్ రాబిన్సన్ శ్వేతసౌధంలోనే ఉన్నారు. ఒబామా ఇద్దరు పిల్లలు మాలియా, సాషా ఆమె సంరక్షణలోనే పెరిగారు.