రామ్‌గౌడ, ప్రియాపాల్ జంటగా సి.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న తాజా చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సి.రవిసాగర్ నిర్మాత. వీజే సాగర్ దర్శకుడు. నాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి క్లాప్‌నిచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ ‘హాస్టల్ చదువుల కారణంగా తల్లిదండ్రుల ప్రేమకు పిల్లలు ఏ విధంగా దూరమవుతున్నారు? పెద్దయిన తర్వాత ఆ పిల్లలు ఎలా తయారవుతున్నారనే పాయింట్‌తో రూపొందిస్తున్నాం. డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అని తెలిపారు. సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వాలనే ఆలోచనతో తెరకెక్కిస్తున్న చిత్రమిదని నిర్మాత పేర్కొన్నారు. చక్కటి కుటుంబ విలువలతో రూపొందుతున్న చిత్రమిదని కథానాయిక ప్రియాపాల్ చెప్పింది. విజయ్‌భాస్కర్, దిల్మ్రేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: తన్విక్.