Vishwambhara | ఎట్టకేలకు ఊపందుకున్న మెగాస్టార్ ‘విశ్వంభర’.. ట్రైలర్ రెడీ, రిలీజ్ డేట్ ఎప్పుడో?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఫాంటసీ సినిమా ‘విశ్వంభర’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఫాంటసీ సినిమా ‘విశ్వంభర’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొంతకాలంగా ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతూ రావడంతో ఫ్యాన్స్‌లో కాస్త నిరాశ కనిపించింది. కానీ ఇప్పుడు మళ్లీ ఈ ప్రాజెక్ట్ ఊపందుకుంది. తాజా సమాచారం ప్రకారం, ‘విశ్వంభర’ ట్రైలర్ కట్ ఇప్పటికే సిద్ధంగా ఉందట. మరోవైపు డబ్బింగ్ పనులను కూడా చిత్రబృందం చాలా వేగంగా పూర్తి చేస్తోంది. దీంతో సినిమా పనులు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది.
ఇప్పుడు అందరి దృష్టి సినిమా విడుదల తేదీపైనే ఉంది. ఇప్పటివరకు రిలీజ్ డేట్ విషయంలో రకరకాల వార్తలు వినిపించినా, అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ట్రైలర్, డబ్బింగ్ పనులు వేగంగా జరుగుతుండటంతో, త్వరలోనే రిలీజ్ డేట్‌పై కూడా స్పష్టత వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. నిర్మాతలు ట్రైలర్‌తో పాటు విడుదల తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటిస్తుండగా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కీరవాణి, గౌర హరి సంగీతం అందిస్తున్నారు. ఫాంటసీ కథకు కీరవాణి మ్యూజిక్ పెద్ద ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చాలా రోజుల తర్వాత వస్తున్న ఈ అప్డేట్లతో మెగా అభిమానుల్లో మళ్లీ జోష్ మొదలైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwambhara | ఎట్టకేలకు ఊపందుకున్న మెగాస్టార్ ‘విశ్వంభర’.. ట్రైలర్ రెడీ, రిలీజ్ డేట్ ఎప్పుడో?
లిఫ్ట్ అడిగి ఫోన్ దొంగలించేందుకు యత్నం.. యువకుడి గొంతు కోసిన దుండగుడు
జల దోపిడీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
Keerthy Suresh | అది నాన్న-కూతురు బంధం.. మిస్కిన్ వివాదంపై స్పందించిన కీర్తి సురేష్!
సీఎం సభకు వెళ్లొస్తుండగా రెండు బస్సుల మధ్య నలిగి మహిళ మృతి.. 5లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసిన పొన్నం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

