ఘట్కేసర్ రూరల్, జనవరి 8 : రైతులు లాభసాటి పంటలతో పాటు పశు సంపదను కాపాడుకోవాలని ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. మండల పరిధి ఎదులాబాద్‌లో శనివారం నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరంలో ఎంపీపీ , మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి పాల్గొని రైతులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ పశు సంపదను పెంచుకుని ఆదాయం పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ సురేశ్, ఎంపీటీసీ రవి, ఉప సర్పంచ్ లింగేశ్వర్ రావు, టీఆర్ఎస్ మండల రైతు విభాగం అధ్యక్షుడు ధర్మారెడ్డి, పశు వైద్యాధికారి డాక్టర్ పద్మిని, నాయకులు సత్తయ్య పాల్గొన్నారు.