మహబూబాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): అమెరికా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన కొదుమూరి సుప్రియ (31) మృతి చెందారు. అమెరికాలోని మిస్సోరిలో నివాసముంటున్న సుప్రియ.. సె యింట్ లూయిస్‌లో రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ఆదివారం రెస్టారెంట్ మూసివేసి స్నేహితురాలితో కలిసి కారులో ఇంటికి వెళ్తున్నారు.
వీరు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ట్రక్కు ఢీకొట్టడంతో సుప్రియ అకడికకడే మృతిచెందగా, కోదాడకు చెందిన మరో మహిళకు గాయాలయ్యాయి. మరిపెడకు చెందిన దారం శ్రీనివాస్ కూతురు సుప్రియకు మహబూబాబాద్‌కు చెందిన కే వెంకటేశ్వర్లు – రాధిక దంపతుల కుమారుడు రంజిత్‌తో ఐదేండ్ల క్రి తం వివాహం జరిగింది. రంజిత్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఉ ద్యోగం చేస్తున్నాడు. వీరికి రెండున్నరేండ్ల బాబు ఉన్నాడు.