Watch: పులి బోనులో ఎరగా కోడి.. చోరీకి యత్నించి లోపల చిక్కుకున్న వ్యక్తి
Watch Video | బోనులో ఒక వ్యక్తి ఉండటం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. చిరుత కోసం ఎరగా ఉంచిన కోడిని చోరీ చేసేందుకు ప్రయత్నించిన అతడు అందులో చిక్కుకున్నట్లు గ్రహించారు. అటవీ శాఖ అధికారులకు దీని గురించి సమాచారం ఇచ్చారు.
లక్నో: పులిని బంధించేందుకు ఏర్పాటు చేసిన బోనులోకి ఒక వ్యక్తి వెళ్లాడు. పులి కోసం ఎరగా బోనులో ఉంచిన కోడిని చోరీ చేసేందుకు అతడు ప్రయత్నించాడు. అయితే డోర్ మూసుకుపోవడంతో ఆ వ్యక్తి పులి బోనులో చిక్కుకుపోయాడు. విస్తూపోయే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో జరిగింది. ఆ జిల్లా పరిధిలోని బసెందువా గ్రామంలో ఒక చిరుత పులి సంచరిస్తున్నది. భయాందోళన చెందిన గ్రామస్తులు దాని గురించి అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో చిరుత జాడను గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది దానిని పట్టుకునేందుకు ఆ గ్రామంలో ఒక బోను ఏర్పాటు చేశారు. చిరుతకు ఎర కోసం ఆ బోనులో ఒక కోడిని ఉంచారు.
కాగా, పులి బోనులో ఉన్న కోడిపై ఒక వ్యక్తి కన్ను పడింది. ఆ కోడిని చోరీ చేసి ఇంటికి తీసుకెళ్లి వండుకుని తినాలని అతడు భావించాడు. గుట్టుగా ఆ బోనులోకి ప్రవేశించాడు. లోపలున్న కోడిని పట్టుకున్నాడు. అయితే ఆ వెంటనే ఆ పులి బోను మూసుకుపోయింది. దీంతో ఆ వ్యక్తి బోను లోపల చిక్కుకున్నాడు. తనను రక్షించాలంటూ అరవడంతోపాటు బోరున ఏడ్చాడు.
మరోవైపు శుక్రవారం ఉదయం గ్రామస్తులు దీనిని గమనించారు. బోనులో పులికి బదులు ఒక వ్యక్తి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. చిరుత కోసం ఎరగా ఉంచిన కోడిని చోరీ చేసేందుకు ప్రయత్నించిన అతడు అందులో చిక్కుకున్నట్లు గ్రహించారు. అటవీ శాఖ అధికారులకు దీని గురించి సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు వెళ్లారు. బోను ముందున్న ఇనుప ఊచల డోర్‌ను తెరిచి ఆ వ్యక్తిని బయటకు రప్పించారు. కాగా, స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో క్లిప్‌పై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు.
#WATCH | Uttar Pradesh: A man got stuck in a cage, installed to nab a leopard, in Basendua village of Bulandshahr dist. Forest Dept says that the man had entered the cage to get a rooster that was kept there as bait for the leopard.
(Video: viral video confirmed by Forest Dept) pic.twitter.com/8ujj23I2AO
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 24, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

