విద్యుత్ కంచె తగిలి వ్యక్తి మృతి
విద్యుదాఘాతం|విద్యుత్ కంచె తగిలి ఓ వ్యక్తి మృతిచెందగా మరొక వ్యక్తి గాయపడ్డాడు. ఈ విషాద సంఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం ఐనం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

కుమ్రంభీం ఆసిఫాబాద్ : పంట చేనుకు అమర్చిన విద్యుత్ కంచె తగిలి ఓ వ్యక్తి మృతిచెందగా మరొక వ్యక్తి గాయపడ్డాడు. ఈ విషాద సంఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం ఐనం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
నాలుగు రోజుల వ్యవధిలో ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి. దహేగాం సబ్ ఇన్స్పెక్టర్ రఘుపతి వివరాలను వెల్లడిస్తూ.. మృతుడు ఐనం గ్రామానికి చెందిన పుల్క లచ్చన్న(45)గా, గాయపడ్డ వ్యక్తిని సుధాకర్‌గా పేర్కొన్నారు.
లచ్చన్న సంఘటనా స్థలంలోనే మృతిచెందగా ఇతన్ని కాపాడటానికి వెళ్లిన సుధాకర్ గాయాలతో బయటపడ్డాడు. చికిత్స నిమిత్తం బాధితుడిని కాగజ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానిక వేటగాళ్లు అడవి పందుల కోసం విద్యుత్ కంచెను ఏర్పాటు చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

