‘రైతు మహాసభలను జయప్రదం చేయాలి’
అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ఆధ్వర్యంలో నవంబర్ 15 నుండి 18 వరకు నల్లగొండలో నిర్వహించనున్న 36వ జాతీయ కిసాన్ మహాసభలను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు.
– మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపు
– నవంబర్ 15 నుండి 18 వరకు నల్లగొండలో 36వ జాతీయ కిసాన్ మహాసభలు
– లక్ష మందితో భారీ ప్రదర్శన.. 300 స్టాళ్లతో వ్యవసాయ ప్రదర్శన
రామగిరి, అక్టోబర్ 19 : అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ఆధ్వర్యంలో నవంబర్ 15 నుండి 18 వరకు నల్లగొండలో నిర్వహించనున్న 36వ జాతీయ కిసాన్ మహాసభలను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నల్లగొండలోని సీపీఎం కార్యాలయం దొడ్డి కొమురయ్య భవనంలో మహాసభల ప్రచార బెలూన్లను ఆవిష్కరించి, ఆహ్వాన సంఘం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 15న లక్ష మందితో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. మహాసభల సందర్భంగా 300 స్టాళ్లతో వ్యవసాయ ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, సెమినార్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
రైతు సమస్యలపై సమగ్ర చర్చ
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు రైతులంతా ఐక్యంగా పోరాడాలని జూలకంటి పిలుపునిచ్చారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ, విద్యుత్ రంగ ప్రైవేటీకరణ, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ప్రభావం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు వంటి అంశాలపై మహాసభల్లో చర్చించి రైతుల భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. మహాసభల విజయవంతానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నామని, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వీరపల్లి వెంకటేశ్వర్లు, రైతు మహిళా రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల, రాష్ట్ర సీనియర్ నాయకులు, ఎలిమినేడు సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారీ ఐలయ్య, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, సిఐటియు జిల్లా నాయకులు ఎండి సలీం, డబ్బికారు మల్లేష్, చినపాక లక్ష్మీనారాయణ, దండెంపల్లి సత్తయ్య, వివిధ ప్రజా సంఘాల నాయకులు పుచ్చకాయల నర్సిరెడ్డి, మల్లం మహేష్, నలపరాజు సైదులు, తుమ్మల పద్మ, అవుట రవీందర్, బాణాల పరిపూర్ణ చారి, భీమగాని గణేష్, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, కన్నెకంటి సత్యనారాయణ, బొల్లు రవీందర్, కంభంపాటి శంకర్, ఆకారం నరేష్, శ్యాంసుందర్ ప్రభాకర్, నకేరేకంటి జానయ్య పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతు మహాసభలను జయప్రదం చేయాలి’
BRS | బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ యువకులు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

