న్యూఢిల్లీ, నవంబర్ 12: చార్జీల పెంపుపై ప్రయాణికుల ఆగ్రహంతో రైల్వే శాఖ దిగొచ్చింది. మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లను ‘స్పెషల్’గా పరిగణించకూడదని, చార్జీలను తగ్గించి కరోనాకు ముందున్నట్టే వసూలు చేయాలని నిర్ణయించింది. కరోనా లాక్డౌన్ను సడలించిన తర్వాత రైల్వే శాఖ ప్రత్యేక రైళ్ల పేరుతో చార్జీలు పెంచి నడుపుతున్నది. ప్రజలు అనవసర ప్రయాణాలు చేయకుండా చార్జీలు పెంచినట్టు చెప్పుకొచ్చింది. తాజాగా, మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లను వాటి రెగ్యులర్ నంబర్లు, చార్జీలతో నడుపుతామని ప్రకటించింది.