హైదరాబాద్, ఆట ప్రతినిధి: సీనియర్ ఇండియన్ గ్రాండ్ ప్రి టోర్నీలో తెలంగాణ యువ అథ్లెట్ గోప మహేశ్వరి సత్తా చాటింది. బుధవారం జరిగిన మహిళల 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ విభాగంలో 10.52.49 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి మహేశ్వరి రజతం కైవసం చేసుకుంది. యూపీ అథ్లెట్ పారుల్ చౌదరి 9.38.29 సెకండ్లతో స్వర్ణం దక్కించుకోగా, సుస్మిత కాంస్యం ఖాతాలో వేసుకుంది. తిరువనంతపురంలో జరుగుతున్న ఈ పోటీల్లో గోపీచంద్ మైత్రా అథ్లెటిక్స్ ప్రాజెక్ట్‌కు చెందిన మహేశ్వరి పతకం సాధించడం సంతోషంగా ఉందని జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్