మహేంద్రన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నీలకంఠ’. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ కథానాయికలు. రాకేష్ మాధవన్ దర్శకుడు. మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మాతలు. జనవరి 2న పానిండియా స్థాయిలో సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్‌లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు.
ఈ సినిమా విజయం పట్ల నిర్మాతలు నమ్మకం వెలిబుచ్చారు. సగటు ప్రేక్షకుడికి కావాల్సిన అంశాలన్నీ ఇందులో ఉంటాయని, ముఖ్యంగా చివరి 20 నిమిషాలూ హంటింగ్‌గా ఉంటుందని, తప్పకుండా అందరికీ నచ్చే సినిమా ఇదని దర్శకుడు రాకేష్ మాధవన్ చెప్పారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల హీరోహీరోయిన్లు ఆనందం వెలిబుచ్చారు. ఇంకా చిత్రబృందం అంతా మాట్లాడారు.