వర్ధన్, కృష్ణప్రియ జంటగా రూపొందుతున్న ప్రేమకథ ‘కాగితం పడవలు’. ఎంజీఆర్ తుకారం దర్శకుడు. కీర్తన నరేశ్ టి.ఆర్, ప్రసాద్‌రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. హీరో xట్రైలర్‌ని విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘ప్రేమ నిప్పులాంటిది.
అది రెండు జీవితాలకూ వెలుగునిచ్చే దీపం అవ్వచ్చు.. లేదా అడవిని దహించే కార్చిచ్చుగా మారొచ్చు..’ అనే డైలాగ్‌తో ఈ ట్రైలర్ మొదలైంది. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ, వారిపై తీసిన ఎమోషనల్ సీన్స్ మనసును తాకేలా ఉన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: రుద్రసాయి, సంగీతం: AIS నౌఫల్ రాజా. నిర్మాణం: ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్.