పుణె: మహారాష్ట్ర మంత్రి, శివసేన నేత గులాబ్రావ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గం ధరంగావ్లోని రోడ్లు బీజేపీ ఎంపీ హేమామాలిని బుగ్గల్లా ఉంటాయన్నారు. జల్గావ్ జిల్లాలోని బోద్వాడ్ నగర్లో ఆదివారం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. తన రాజకీయ ప్రత్యర్థి ఎన్సీపీ నేత ఏక్నాథ్ ఖడ్సేను విమర్శిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.