శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న సినిమా ‘మధురపూడి గ్రామం అనే నేను’. జి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మాతలు. మల్లి దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘వెళ్లే గోరింక’ ను హీరో ఆకాష్ పూరీ విడుదల చేశారు. పాట బాగుందన్న ఆకాష్..చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యాన్ని అందించగా…ధనుంజయ్, సాహితీ ఆలపించారు. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నారు.