13న మరో అల్పపీడనం.. తెలంగాణ, ఏపీకి వర్ష సూచన
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ నెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని అంచనా వేస్తున్నది.
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ నెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని అంచనా వేస్తున్నది. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని కదలిక, తీవ్రత ఆధారంగా వర్షాల ప్రభావంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది.
ఈశాన్య దిశ నుంచి వీస్తున్న పొడిగాలుల ప్రభావంతో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17 నుంచి 19 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. రాజేంద్రనగర్, శంషాబాద్, మేడ్చల్, ఘట్కేసర్ వంటి పలు ప్రాంతాల్లో ఉదయం వేళ పొగమంచు దర్శనమిస్తున్నది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14 నుంచి 16 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తకువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రజలు వాతావరణ శాఖ హెచ్చరికలు గమనించాలని, చలి, పొగమంచు, ఆకస్మిక వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

