బియ్యం ఎమ్మార్పీ దాటితే చర్యలే
బియ్యా న్ని అధిక ధరలకు విక్రయించడంతోపాటు అక్రమాలకు పాల్పడితే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని సివిల్ సైప్లె డైరెక్టర్, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ (సీఆర్వో) శ్యామ్‌ప్రసాద్‌లాల్ హెచ్చరించారు.
- ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు లోబడే విక్రయించాలి
- సీఆర్వో శ్యామ్‌ప్రసాద్‌లాల్ హెచ్చరిక
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : బియ్యా న్ని అధిక ధరలకు విక్రయించడంతోపాటు అక్రమాలకు పాల్పడితే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని సివిల్ సైప్లె డైరెక్టర్, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ (సీఆర్వో) శ్యామ్‌ప్రసాద్‌లాల్ హెచ్చరించారు. బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినా, బ్లాక్ మారెట్‌కు తరలించినా లేదా కావాలని ధరలు పెంచినా చట్టపరమైన శిక్షలు తప్పవని స్పష్టంచేశారు. పదేపదే ఇలాంటి తప్పులు చేసే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. బియ్యం ధరలు, అక్రమ నిల్వలపై సోమవారం ఆయన స్పందించారు. బీపీటీ, కేఎన్ఎం బియ్యం గరిష్ఠ ధరను కిలోకు రూ.66గా, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా బియ్యం ధర రూ.74గా, హెచ్ఎంటీ, జేఎస్ఆర్ బియ్యం గరిష్ఠ ధరను రూ.79గా నిర్ణయించినట్టు తెలిపారు.
ఈ ధరలకు మించి విక్రయించొద్దని స్పష్టం చేశారు. 25 కిలోల బస్తాలపై 26 కిలోల స్టికర్లు వేసి తూకంలో మోసం చేస్తున్న, ఎమ్మాఆర్పీ కంటే అధిక ధరకు విక్రయిస్తున్న వ్యాపారులపై ఇప్పటికే దాడులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. బియ్యం స్టాక్ లేదంటూ రిటైల్ వ్యాపారుల ఆందోళనపై శ్యామ్‌ప్రసాద్ స్పందిస్తూ… రిటైల్ వ్యాపారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఈ వదంతులను నమ్మి ధరలు పెంచవద్దని కోరారు. ఒకవేళ రిటైలర్లకు స్టాక్ సమస్యలు ఉంటే, వారు హోల్‌సేల్ వ్యాపారుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని, నేరుగా తమ జిల్లా పౌరసరఫరాల అధికారిని (డీసీఎస్వో) కలిసి కావాల్సిన బియ్యం వివరాలు (ఇండెంట్) ఇవ్వాలని సూచించారు. నేరుగా మిల్లర్ల నుంచే బియ్యం తెప్పించి ఇస్తామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

