రక్తంలో ప్లేట్లెట్స్ ఎందుకు తగ్గుతాయి?
కొంతమంది పిల్లలకు ఏదైనా ఆరోగ్య పరీక్ష చేసినప్పుడు రక్తంలో ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయని బయటపడుతుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ వస్తారు.
కొంతమంది పిల్లలకు ఏదైనా ఆరోగ్య పరీక్ష చేసినప్పుడు రక్తంలో ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయని బయటపడుతుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ వస్తారు. ఇది ప్రమాదకరమైన సమస్య కాదు. సకాలంలో చికిత్స చేస్తే ఇది మందులకు లొంగే జబ్బే. సాధారణంగా రక్తంలో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్స్‌లెట్స్ ఉంటాయి. ప్లేట్లెట్స్ రక్తస్రావాన్ని నివారించి ప్రాణులను కాపాడతాయి. ఆ ప్లేట్లెట్స్ తగ్గితే రక్తస్రావం జరుగుతుంది.
ప్లేట్లెట్స్ తగ్గాయని చెప్పగానే చాలామంది భయపడతారు. అంత ఆందోళన అవసరం లేదు. మానవ రక్తంలో ప్రతి మైక్రో లీటర్లో లక్ష నుంచి అయిదు లక్షల వరకు ప్లేట్లెట్స్ ఉంటాయి. వీటి సంఖ్య తగ్గితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. చర్మం నుంచి రక్తం కారుతుంది. పళ్లు తోముకునేప్పుడు రక్తం కారుతుంది. మూత్రంలో రక్తం పడుతుంది. వాంతుల అయినప్పుడు రక్తం పడొచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తప్పకుండా వైద్యులకు చూపించాలి.
ఈ లక్షణాలు లేకపోయినా ఏదైనా రోగ నిర్ధారణ కోసం రక్త పరీక్ష చేసినప్పుడు ప్లేట్లెట్స్ తగ్గినట్టుగా గుర్తించినా వైద్య చికిత్స చేయించాలి.
ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు ఆ రోగిలో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాల సంఖ్య ఎంత? రక్తహీనత ఉన్నదా? ఇన్ఫెక్షన్ ఉన్నదా? ఎక్కడెక్కడ రక్తస్రావం జరుగుతున్నది? రక్తస్రావం ఎలా ఉంది? అనేవి నిర్ధారించుకున్నాక చికిత్స అందిస్తారు. వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ తగ్గడం సాధారణమే. ఆ సమయంలో తెల్ల రక్త కణాలు కూడా తగ్గొచ్చు. ఇమ్యూనిటీ కారణంగానూ ప్లేట్లెట్స్ తగ్గుతాయి. దీనిని ఇమ్యూన్ థ్రాంబోసైటోపీనియా అంటారు. కొంతమందిలో ఏ కారణం లేకుండా ప్లేట్లెట్స్ తగ్గొచ్చు. కొంతమందిలో హెపటైటిస్, హెచ్ఐవీ, క్యాన్సర్ వంటి వ్యాధుల వల్ల వ్యాధి నిరోధకత తగ్గొచ్చు.
ఇమ్యూన్ థ్రాంబోసైటోపీనియా ఉన్న పిల్లలు బాగానే ఉంటారు. ప్లేట్లెట్స్ కౌంట్ పదివేలకు తక్కువస్థాయికి పడిపోతే రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది. వాళ్లకు హాస్పిటల్లో చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ జబ్బుకు కారణాలను కొన్ని లక్షణాలు చూసి నిర్ణయానికి రాలేము. కొన్ని లక్షణాల ఆధారంగా నిర్ధారణకు రాకుండా అనేక లక్షణాలను పరిశీలించాలి. ఆరు నెలలలోపు పిల్లల్లో ప్లేట్లెట్స్ తక్కువగా ఉంటే వ్యాధి నిరోధకత వల్ల తగ్గాయా? లేక ఏదైనా జన్యు సమస్య ఉన్నదా తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తాం. ఈ వ్యాధి బాధితులకు చికిత్స కోసం కాలేయం, ఎముక మజ్జనూ పరీక్షించాల్సిన అవసరం రావొచ్చు. ప్లేట్లెట్స్ తగ్గగానే ఆందోళన చెందకుండా వైద్యుల సలహాలతో సకాలంలో చికిత్స చేయిస్తే ఈ సమస్యను తేలిగ్గా అధిగమించవచ్చు.
-డాక్టర్ నల్లా అనురాగ్ రెడ్డి
పిడియాట్రిక్ హిమటాలజిస్ట్
ఆంకాలజిస్ట్, బ్లడ్ & మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్, హైదరాబాద్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

