న్యూఢిల్లీ : పెంపుడు కుక్క కోసం డాక్టర్‌గా మారిన చిన్నారి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. బుటెన్బిడెన్ ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియోలో (Viral Video) ఓ బాలుడు వెటర్నరీ డాక్టర్ కావాలనే తన కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో కుక్కకు చికిత్స చేస్తూ కనిపించడం ఆకట్టుకుంటుంది.
ఈ క్లిప్‌లో ఎంతో సహనంతో కుక్క రోగిలా వ్యవహరిస్తే చిన్నారి డాక్టర్‌గా ఆకట్టుకున్నాడు. వీడియో ఆరంభంలో బాలుడు కుక్కను టాయ్ స్టెతస్కోప్‌తో పరీక్షిస్తాడు. ఆపై పూర్తిస్ధాయిలో చెకప్ చేస్తాడు. భవిష్యత్ వెటర్నరీ డాక్టర్..తన పేషెంట్‌తో అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
Future veterinarian and his patient.. 😊 pic.twitter.com/lJvTfDT57u
— Buitengebieden (@buitengebieden) April 25, 2023
ఈ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 5.5 లక్షల మందికి పైగా వీక్షించారు. చిన్నారికి సరైన పేషెంట్‌గా కుక్క సరిగ్గా నటించిందని, వీరి మధ్య బంధాన్ని ఇది వెల్లడిస్తోందని పలువురు యూజర్లు ప్రశంసలు గుప్పించారు. స్వీట్ బాయ్…తన కుక్కతో లవ్ దట్ అని కామెంట్స్ సెక్షన్లో పలువురు రాసుకొచ్చారు.
Read More