Health Tips | ఈ జీవనశైలి అలవాట్లతో దీర్ఘాయువు సొంతం..!
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ఏప్రిల్ 7ను అంతర్జాతీయ ఆరోగ్య దినంగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) పాటిస్తోంది.
Health Tips : ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ఏప్రిల్ 7ను అంతర్జాతీయ ఆరోగ్య దినంగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) పాటిస్తోంది. ఇక ప్రజలు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించేందుకు ఇదే వేదికగా డబ్ల్యూహెచ్ఓ అవగాహనా కార్యక్రమాలను చేపడుతోంది. ప్రజలు దీర్ఘాయువుతో ఆరోగ్యంగా జీవించాలంటే జన్యుపరమైన కారణాలతో పాటు, పర్యావరణం, జీవనశైలి వంటి ఎన్నో అంశాలు ముడిపడిఉంటాయి.
మనిషి ఆయుప్రమాణాన్ని నిర్ధేశించడంలో జన్యువులు ప్రధాన పాత్ర పోషించినా జీవనశైలి అలవాట్లు కూడా ఆరోగ్యాన్ని, దీర్ఘాయువును ప్రభావితం చేస్తాయి. జీవనశైలి అలవాట్లలో మార్పులతో దీర్ఘాయువును ఎలా సొంతం చేసుకోవచ్చో పరిశీలిద్దాం..నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన బరువును కొనసాగించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రోజూ వ్యాయామం చేయడం ద్వారా రక్త ప్రసరణ పెరగడంతో పాటు మధుమేహం, బీపీ వంటి అనారోగ్యాల ముప్పు తగ్గించుకోవచ్చు. ఇక వారానికి ఓ మోస్తరు తీవ్రతతో కూడిన వ్యాయామాన్ని 150 నిమిషాలు చేస్తే సరిపోతుంది.
ఇక వ్యాయామంతో పాటు ఆరోగ్యకర ఆహారం తీసుకోవడం కీలకం. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకర కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్, తీపి పదార్ధాలు, తీపి పానీయాలకు దూరంగా ఉండటంతో పాటు సోడియం, ఫ్యాట్స్ తక్కువ తీసుకోవాలి. ఈ జీవనశైలిని పాటిస్తూనే రోజుకు 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవడం ముఖ్యం. ఇక ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం ఈ జీవనశైలి అలవాట్లను అలవరచుకోవాలి..
వ్యాయామం
ఆరోగ్యకర ఆహారం
తగినంత నిద్ర
ఒత్తిడి నియంత్రణ
మద్యానికి దూరం
పొగాకు వాడకానికి దూరం
ఆరోగ్యకరమైన బరువు
తరచూ వైద్య పరీక్షలు
Read More :
Chicken Price | మాంసంప్రియులకు షాకింగ్ న్యూస్.. వారం రోజుల్లోనే 100 పెరిగిన చికెన్ ధరలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

