ట్రైపోలి: లిబియా ప్రధాని అబ్దుల్ హమీదల్ దెయిబాపై హత్యాయత్నం దాడి జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారుపై బుల్లెట్ల వర్షం కురిసింది. ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఈ కాల్పుల ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆ కాల్పుల్లో ప్రధాని అబ్దుల్ హమీదల్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.
ప్రభుత్వ అధికారం కోసం ఆ దేశంలో చాన్నాళ్ల నుంచి ఫ్యాక్షన్ వార్ నడుస్తోంది. ఫైరింగ్‌కు దిగిన దుండగులు పరారీ అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు. లిబియాలో 2011లో గడాఫీ పాలనకు నాటో దళాలు అంతం పలికిన తర్వాత ఆ దేశంలో శాంతి, సుస్థిరత లోపించాయి. దీంతో అక్కడ తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య వైరం పెరిగింది. దెయిబాను యూఎన్ మద్దతుతో గత మార్చిలో ప్రధానిగా చేశారు. అయితే డిసెంబర్లో ఎన్నికలు వాయిదా పడ్డ నేపథ్యంలో.. వర్గ పోరు మరింత అధికమైంది.