‘తన మాటకారితనంతో సుమ చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నేను ఏదైనా కార్యక్రమానికి హోస్ట్‌గా పనిచేయాల్సివస్తే సుమ వీడియోలు చూస్తూ ప్రేరణ పొందుతుంటా’ అని అన్నారు రానా. ‘జయమ్మ పంచాయతీ’ ట్రైలర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో ఆయన విడుదలచేశారు. వ్యాఖ్యాత సుమ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ కుమార్ కలివారపు దర్శకుడు. బలగ ప్రకాష్ నిర్మాత. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ ‘తెలుగు ఇండస్ట్రీ పట్ల సుమ చూపించే ప్రేమకు ఎంత తిరిగి ఇచ్చినా తక్కువే అవుతుంది. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా. సుమగారు చెబుతున్న మాటలు వింటుంటే సినిమా చూడాలన్న ఆసక్తి కలుగుతుంది’ అని తెలిపారు. సుమ మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం శ్రీకాకుళం యాస నేర్చుకున్నా. జయమ్మ ఎవరు? ఓ ఊరి సమస్యలను ఆమె ఎలా నెరవేర్చిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు భిన్నమైన కథ, కథనాలతో సాగే చిత్రమిది’ అని చెప్పింది. ఈ సినిమాలో జయమ్మగా సుమ అందరి మనసుల్లో నిలిచిపోతుందని నిర్మాత అన్నారు