పసికందులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం
ఆదిలాబాద్‌లోని రిమ్స్ దవాఖానలోని ఎన్ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న పసికందులు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తంచేశారు. దాదాపు 25 మంది అప్పుడే పుట్టిన చిన్నారులు ఉన్న వార్డులో ఇలాంటి దారుణ ఘటన చోటుచేసుకోవడం ప్రభుత్వ వైఫల్యానికి, దవాఖాన యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- రిమ్స్‌లో పిల్లల మరణంపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
- బాధితులకు రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్
- బీఆర్ఎస్ తరఫున రూ. లక్ష చొప్పున ఇస్తున్నట్టు ప్రకటన
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్‌లోని రిమ్స్ దవాఖానలోని ఎన్ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న పసికందులు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తంచేశారు. దాదాపు 25 మంది అప్పుడే పుట్టిన చిన్నారులు ఉన్న వార్డులో ఇలాంటి దారుణ ఘటన చోటుచేసుకోవడం ప్రభుత్వ వైఫల్యానికి, దవాఖాన యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పసిపిల్లల ప్రాణాలు కాపాడాల్సిన వార్డులోనే ఈ ప్రమాదం జరగడంపై ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని ధ్వజమెత్తారు. దవాఖానలోని తీవ్ర లోపాలు, నిర్లక్ష్యమే ఇందుకు కారణమని మండిపడ్డారు. ఈ ఘోరానికి కారకులైన బాధ్యులందరిపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పార్టీ తరఫున లక్ష సాయం
ఈ ప్రమాదం తెలిసిన వెంటనే తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించినట్టు కేటీఆర్ తెలిపారు. చనిపోయిన ఒకో చిన్నారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో స్పందించి, మృతి చెందిన పిల్లల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

