హైదరాబాద్ : జర్మనీ యువ టెన్నిస్ సంచలనం అరియా లాంక్రిసెంట్కు కేఎస్‌జీ(కంకణాల స్పోర్ట్స్ గ్రూపు) స్పాన్సర్షిప్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే హ్యాండ్‌బాల్, వాలీబాల్, రేసింగ్, బ్యాడ్మింటన్‌లో భాగమైన కేఎస్‌జీ తొలిసారి టెన్నిస్‌లోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా 8ఏండ్ల అరియాతో 10 ఏండ్లకు స్పాన్సర్షిప్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేఎస్‌జీ యజమాని అభిషేక్‌రెడ్డి మంగళవారం పేర్కొన్నారు. ‘భారత్‌లో టెన్నిస్‌కు మంచి ఆదరణ ఉంది. గ్రాండ్‌స్లామ్ టోర్నీలకు ఐపీఎల్‌తో సమానంగా వీక్షణలు ఉన్నాయి’ అని అన్నారు.